
క్రీడలు

మార్కులు తక్కువ వచ్చాయని మందలించిన మహిళా అధ్యాపకురాలిపై కోపంతో, ఓ విద్యార్థి సోషల్ మీడియాలో ఆమెను వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వన్‌టౌన్ సీఐ బి. సునిల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న అయాన్ (18)కు ఇటీవల జరిగిన పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో అతడిని ఫిజిక్స్ బోధించే మహిళా అధ్యాపకురాలు మందలించింది.
ఆ కోపంతో విద్యార్థి గత నవంబర్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పుడు ఐడీ సృష్టించి ఆమెపై అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!