

పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వారం రోజుల్లో స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఆయన తప్పుకోకపోతే కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించాలని కోరారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో మాట్లాడుతూ, ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే భారీ స్థాయిలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. బాధ్యత నిర్ధారణ జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే ఉందని అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. పార్టీ ఏర్పడి 15 రోజులు మాత్రమే అయినప్పటికీ, వారం రోజుల్లో ఉద్యమాన్ని జాతీయ స్థాయికి విస్తరించే కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. జంతర్‌మంతర్‌లో నిర్వహించిన ధర్నా పెద్ద ఉద్యమానికి ప్రారంభ సంకేతం మాత్రమేనన్నారు. మరోవైపు ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఆయన నివాసం వద్ద భద్రతను పెంచుతూ, గతంలో ఉన్న 11 మంది పోలీసుల స్థానంలో 15 మంది పోలీసులను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే పార్టీ పేరును మార్చుకోవాలని హరియాణా మంత్రి అనిల్ విజ్ సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!