
టెక్నాలజీ

వారణాసి టైటిల్ లాంచ్లో ప్రియాంకా చోప్రా షోపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఆమె ప్రసంగంలో కొద్ది తెలుగు మాటలు చెప్పడంతో అక్కడి వాళ్లు క్షణాల్లోనే ఫిదా అయ్యారు. క్రీమ్ ఎంబ్రాయిడెడ్ హాఫ్ సారీ, హెవీ నెక్లెస్, నెత్తిమీద అలంకారాలు అన్నీ అద్భుతంగా కలిసిపోయాయి. ఆమె నిజంగా దేవతలా కనిపించింది. తర్వాత ఆమె మహేష్ బాబుతో నిలబడిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇద్దరి కెమిస్ట్రీ గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. తర్వాత ప్రియాంకా “నా లోపలున్న దేవిని వెలికి తీస్తున్నా” అంటూ ఫోటోలు పోస్ట్ చేయడంతో, ఆమె దేవత పాత్రలో నటిస్తున్నట్లు క్లియర్ అయింది. మహేష్ రాముడిగా వస్తున్నాడన్న వార్తలతో ఇదే మ్యాచ్ అయింది. ఇక నిక్ జోనస్ “అందరి తరఫున నేను చెబుతున్నా… ఓ మై గాడ్!” అని కామెంట్ చేసి, వారి ప్రేమను మళ్లీ అందరి ముందుకు తీసుకొచ్చాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!