

యశోద హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న యశోద హెల్త్‌కేర్ సర్వీసెస్ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు సెబీ అనుమతి లభించింది. ఈ సంస్థ సెప్టెంబరులో ఐపీఓ కోసం దరఖాస్తు చేయగా, ఇందులో కొత్త ఈక్విటీ షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (OFS) కూడా ఉండనుంది. ఈ ఐపీఓ పరిమాణం సుమారు రూ.3,000–4,000 కోట్లుగా అంచనా. సమీకరించే నిధులను కొత్త నగరాల్లో ఆస్పత్రుల ఏర్పాటు, పడకల సామర్థ్య విస్తరణ, ఆధునిక సాంకేతిక పరికరాల కొనుగోలుకు వినియోగించనుంది.
అదేవిధంగా, మరో ఆరు కంపెనీల ఐపీఓలకు కూడా సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఆర్ఎస్బీ రిటెయిల్ ఇండియా, ఫ్యూజన్ సీఎక్స్, ఓరియంట్ కేబుల్స్, టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్స్, ఎస్ఎఫ్సీ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్, లోహియా కార్ప్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి సుమారు రూ.6,000 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.
ఆర్ఎస్బీ రిటెయిల్ ఇండియా రూ.500 కోట్ల ఐపీఓ చేపట్టనుండగా, అందులో రూ.275 కోట్లు అప్పుల తీర్చడానికి, రూ.118 కోట్లు కొత్త స్టోర్ల ప్రారంభానికి వినియోగించనుంది. ఫ్యూజన్ సీఎక్స్ రూ.1,000 కోట్ల ఐపీఓకు సిద్ధమైంది. ఓరియంట్ కేబుల్స్ కొత్త షేర్ల జారీతో పాటు ఓఎఫ్ఎస్ ద్వారా నిధులు సమీకరించనుంది. ఎస్ఎఫ్సీ ఎన్విరాన్మెంటల్ ఐపీఓలో కొత్త షేర్లు, ఓఎఫ్ఎస్ రెండూ ఉండగా, లోహియా కార్ప్ ఐపీఓ పూర్తిగా ఓఎఫ్ఎస్గా ఉండటం విశేషం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!