

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి రాజకీయ పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలపై పడింది. సంక్షేమ పథకాలు, నగదు బదిలీ హామీలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడు రాష్ట్రాల ఖజానాలపై దాదాపు రూ.1.69 లక్షల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులపై ప్రభావం పడొచ్చని విశ్లేషిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డుపక్కన ఝాల్మురీ అమ్ముతున్న వ్యక్తి వద్ద ఆగి మరమరాలు తిన్న ఘటన చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు బీజేపీ ప్రకటించిన సంక్షేమ హామీలపై ఆర్థిక చర్చలు మరింత వేడెక్కాయి. మహిళలు, నిరుద్యోగులకు నెలవారీ నగదు సహాయం వంటి పథకాల అమలుతో బెంగాల్ ఖజానాపై సుమారు రూ.72,600 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!