
ఓటీటీ

తెలంగాణ రాష్ట్రం ఎగుమతుల రంగంలో గణనీయమైన వృద్ధిని సాధించి దేశంలో కీలక స్థానాన్ని దక్కించుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2023-24లో 14,026 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు 2024-25 నాటికి 19,123 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇది సుమారు 36 శాతం వృద్ధిని సూచిస్తుంది.
ఈ వృద్ధికి ప్రధానంగా ఐటీ, ఔషధ రంగాలు తోడ్పడ్డాయి. హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా క్లస్టర్లు, ఐటీ హబ్‌లు బలంగా అభివృద్ధి చెందడం ఎగుమతులకు ఊతమిచ్చింది. డ్రగ్ ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్ సేవలతో పాటు ఇంజినీరింగ్, రసాయనాలు, వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ప్రదర్శనతో తెలంగాణ దేశంలో ఏడో స్థానాన్ని సాధించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!