

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటులో అమెరికా కంపెనీలు భారత్‌ను కీలక కేంద్రంగా చూస్తున్నాయి. 2020 నుంచి 2025 మధ్య హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో విదేశీ సంస్థలు జీసీసీల కోసం 101 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ వసతులను లీజుకు తీసుకున్నాయి. ఇదే కాలంలో మొత్తం ఆఫీస్ లీజింగ్ 280.2 మిలియన్ ఎస్ఎఫ్టిగా నమోదైనట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, కోల్‌కతా, ముంబై, పుణె నగరాల డేటా ఆధారంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ నగరాల్లో మొత్తం ఉపాధి డిమాండ్‌లో 36 శాతం జీసీసీల నుంచే వస్తోంది.
గత ఐదేళ్లలో నమోదైన 101 మిలియన్ ఎస్ఎఫ్టీల జీసీసీ లీజింగ్‌లో 71 మిలియన్ ఎస్ఎఫ్టీని అమెరికా కంపెనీలు తీసుకోవడం గమనార్హం. కరోనా తర్వాత భారత ఆఫీస్ మార్కెట్ వేగంగా విస్తరించిందని, జీసీసీలు ఇప్పుడు ఖర్చు తగ్గింపు కేంద్రాలకే పరిమితం కాకుండా ఆవిష్కరణ, పరిశోధన ఆధారిత గ్లోబల్ హబ్‌లుగా మారుతున్నాయని కొలియర్స్ ఇండియా తెలిపింది. 2025 లో విదేశీ సంస్థలు భారత్‌లో 29.2 మిలియన్ ఎస్ఎఫ్టీలకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. యూఎస్ సంస్థల నుంచి టెక్నాలజీ ఆధారిత జీసీసీల డిమాండ్ స్థిరంగా ఉండగా, యూరప్ మరియు బ్రిటన్ సంస్థల నుంచి ఇంజనీరింగ్, తయారీ, బీఎఫ్ఎస్ఐ, కన్సల్టింగ్ రంగాల్లో డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!