
జనరల్

దేశీయంగా వాహన రిటైల్ విక్రయాలు ఈ ఏడాది మేలో 25,31,067 యూనిట్లకు చేరుకున్నాయని ఫాడా వెల్లడించింది. గత ఏడాది మేలో నమోదైన 23,10,451 వాహనాలతో పోలిస్తే ఇది 9.55 శాతం వృద్ధి. విద్యుత్ వాహనాల అమ్మకాలు తొలిసారిగా 11 శాతానికి పైగా పెరిగినట్లు డీలర్లు తెలిపారు. ఇంధన ధరల పెరుగుదల, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అధిక మైలేజీ వాహనాలపై డిమాండ్ పెరిగింది.
కమర్షియల్ వాహనాలు, ప్రయాణికుల వాహనాలు, ఈవీలు అన్నీ మేలో మంచి పనితీరు చూపాయి. ద్విచక్ర ఈవీల విభాగంలో కూడా వృద్ధి 9.25 శాతానికి పెరిగింది. రాబోయే నెలల్లో వృద్ధి కొనసాగవచ్చని 50.52 శాతం డీలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ నగదు ప్రవాహం, రుతుపవనాలు, వ్యయ ఒత్తిళ్లు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని అంచనా.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!