
న్యూస్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు క్షీణించి 71,947.55 వద్ద ముగియగా, నిఫ్టీ 488.20 పాయింట్లు పడిపోయి 22,331.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా సుమారు 2.6 శాతం మేర నష్టపోయాయి. ఆటో, ఎఫ్ఎమ్సీజీ, టెలికం, రియల్టీ, అలాగే ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు 2–4 శాతం వరకు పడిపోయాయి.
ఇక కరెన్సీ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒక దశలో 95.12 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకుంది. అయితే చివరికి కొంత కోలుకుని 94.83 వద్ద ముగిసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!