
జనరల్

అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల ప్రభావంతో రూపాయి విలువ భారీగా పడిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి 39 పైసలు క్షీణించి 96.20 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 95.81తో పోలిస్తే 96.19 వద్ద ప్రారంభమై, ఒక దశలో 96.39 వరకు పడిపోయింది.
ఫారెక్స్ ట్రేడర్ల ప్రకారం పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, డాలర్ బలపడటం రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ కారణంగా రాబోయే రోజుల్లో కూడా రూపాయి ఒడిదుడుకులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే రిజర్వ్ బ్యాంక్ జోక్యం లేదా బంగారం, వెండి దిగుమతులపై ఆంక్షలు విధిస్తే రూపాయికి కొంత మద్దతు లభించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. స్పాట్ మార్కెట్లో రూపాయి 96 నుంచి 96.60 శ్రేణిలో కదలాడవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!