
జనరల్

డిజిటల్ చెల్లింపులను అత్యంత సులభతరం చేసిన యూపీఐ సేవల ద్వారా గత ఆర్థిక సంవత్సరం 2025-26లో జరిగిన మొత్తం లావాదేవీల విలువ రూ.314 లక్షల కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపులకు యూపీఐ ప్రధాన వేదికగా మారింది.
జాతీయ చెల్లింపుల సంస్థ అభివృద్ధి చేసిన ఈ సేవలు 2016 ఆగస్టు 11న ప్రారంభమయ్యాయి. తొలి ఆర్థిక సంవత్సరం 2016-17లో కేవలం రూ.0.07 లక్షల కోట్ల లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో లావాదేవీల విలువ 4,000 రెట్లకు పైగా పెరగడం విశేషం.
అదే విధంగా 2016-17లో కేవలం 2 కోట్ల లావాదేవీలు జరగగా, 2025-26లో ఈ సంఖ్య 24,162 కోట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో నెలవారీ లావాదేవీలు తొలిసారిగా 2,000 కోట్ల మైలురాయిని దాటగా, డిసెంబరులో 2,163 కోట్లతో కొత్త రికార్డు నమోదైంది. రోజుకు సగటున 60 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!