
సినిమాలు

దేశంలో మొబైల్ వినియోగదారులకు మరోసారి రీఛార్జ్‌ల భారం పడే అవకాశం ఉంది. వచ్చే 3 నుంచి 6 నెలల్లో టెలికాం కంపెనీలు టారిఫ్‌లను సుమారు 10 శాతం వరకు పెంచవచ్చని యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. ఇది గతంలో జరిగిన భారీ పెంపుల కంటే తక్కువగా ఉండొచ్చని తెలిపారు.
గతంలో 15–20 శాతం వరకు పెంపులు జరిగినప్పటికీ, ఈసారి పరిమిత స్థాయిలో మాత్రమే ధరలు సవరించబడే అవకాశం ఉందని ఆయన సీఎన్‌బీసీ-టీవీ18తో అన్నారు. కంపెనీల ఆదాయ అవసరాలను సమతుల్యం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!