

అప్పుడప్పుడూ కొంత మార్పులు ఎదురైనా దేశంలోని స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) రంగం స్థిరంగా అభివృద్ధి దిశగా సాగుతోంది. 2030 నాటికి ఈ మార్కెట్ పరిమాణం రూ.88 లక్షల కోట్లకు చేరుకునే అవకాశముందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ–నరెడ్కో సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గత ఏడాది నమోదైన రూ.26.4 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికమని నివేదిక స్పష్టం చేసింది.
అదే విధంగా, 2047 నాటికి రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం మరింతగా పెరిగి రూ.440.5 లక్షల కోట్ల నుంచి రూ.616.7 లక్షల కోట్ల స్థాయికి చేరవచ్చని కేపీఎంజీ ఇండియా గ్లోబల్ విభాగం హెడ్ నీరజ్ బన్సాల్ తెలిపారు. ‘ది రోల్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇన్ వికసిత్ భారత్, 2047’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో స్థిరాస్తి రంగం కీలక పాత్ర పోషిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారనుందని పేర్కొన్నారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!