
టెక్నాలజీ

వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలు దేశంలోని 28 లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుకూలంగా మారాయి. ఈ కాలంలో ఈ సంస్థలు మొత్తం ₹92,437 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు నమోదు చేశాయి. ఇందులో టాప్-5 రియల్ ఎస్టేట్ కంపెనీల వాటానే ₹63,000 కోట్లకు పైగా (సుమారు 70%) ఉంది.
కోవిడ్ తర్వాత అన్ని సౌకర్యాలు కలిగిన నివాస గృహాలపై డిమాండ్ భారీగా పెరగడం, చిన్న బిల్డర్ల వద్ద కొనుగోలు చేయడంపై కొనుగోలుదారుల్లో నమ్మకం తగ్గడం, రెరా ఉన్నప్పటికీ చిన్న కంపెనీలపై విశ్వాసం లోపించడం వంటి అంశాలు ఈ రికార్డు అమ్మకాలుకు ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి.
కంపెనీ పేరు(అమ్మకాలు (₹ కోట్లలో))
ప్రెస్టీజ్ గ్రూప్(₹18,147.7)
డీఎల్ఎఫ్(₹15,757)
గోద్రెజ్ ప్రాపర్టీస్(₹15,587)
లోథా డెవలపర్స్(₹9,020)
సిగ్నేచర్ గ్లోబల్(₹4,650)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!