
గాసిప్స్

పిరమల్ ఫైనాన్స్, ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ, నూతన వ్యాపార విభాగంలోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం గృహ, వ్యక్తిగత, ఎంఎస్ఎంఈ, యూజుడ్ కార్లపై రుణాలు అందిస్తున్న ఈ సంస్థ, త్వరలో బంగారం రుణాల విభాగంలోకి ప్రవేశించనున్నట్టు సీఈఓ జగ్దీప్ మల్లారెడ్డి ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి అవసరమైన అనుమతులు వచ్చాయని, ఈ సేవలను త్వరలో ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు.
వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే నాలుగు నుంచి ఐదేళ్లలో 50 నుంచి 75 కొత్త శాఖలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు, తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 59 శాఖలను నిర్వహిస్తున్న ఈ సంస్థ ఏయూఎం రూ.75 వేల కోట్లుగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రూ.1 లక్ష కోట్లకు, 2027-28 నాటికి రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!