ఈవీ వాహనాల ఛార్జింగ్ పరికరాల తయారీ కోసం ఎక్సికామ్ టెలి సిస్టమ్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కొత్త కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమైంది. రూ.216 కోట్ల పెట్టుబడితో 18.4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కర్మాగారంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ పరికరాలు తయారు చేయనున్నారు. ఇందులో డీసీ వేగవంతమైన ఛార్జర్లు, ఏసీ ఛార్జర్లు, రెక్టిఫైర్లు, నియంత్రణ పరికరాలు, లిథియం అయాన్ బ్యాటరీ మాడ్యూల్స్ వంటి విద్యుత్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
ఎక్సికామ్ టెలి సిస్టమ్స్‌కు దేశంలో ఇది రెండో తయారీ కేంద్రం. ఇప్పటికే గురుగ్రామ్ వద్ద సంస్థకు ఒక ఉత్పత్తి యూనిట్ కొనసాగుతోంది. హైదరాబాద్‌లో తయారయ్యే ఈ పరికరాలను భారత్‌తో పాటు అమెరికా, యూరప్, ఆగ్నేయాసియా దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఈ కర్మాగారంలో దాదాపు 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని సంస్థ తెలిపింది. ఈ యూనిట్ ద్వారా విద్యుత్ వాహనాల రంగంలో తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.

























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!