

భారత జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఎన్సీసీ లిమిటెడ్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఎన్‌సీసీతో పాటు దాని అనుబంధ సంస్థ ఓబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఓబీఐఎల్)ను రెండేళ్ల పాటు ఎన్హెచ్ఏఐకి సంబంధించిన అన్ని టెండర్లు, కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా నిషేధించింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చినట్లు ఎన్సీసీ రెగ్యులేటరీ సంస్థలకు తెలియజేసింది. ఉత్తరప్రదేశ్‌లో బీఓటీ విధానంలో నిర్మించిన ఒక రహదారి ప్రాజెక్టు ఆలస్యంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
అయితే, ప్రాజెక్టు ఆలస్యం ఎన్హెచ్ఏఐ భూమి సేకరణలో చేసిన జాప్యం కారణంగానే జరిగిందని ఎన్సీసీ వాదిస్తోంది. ఈ విషయంపై ఎన్సీసీ ఆర్బిట్రేషన్‌కు వెళ్లగా, 2024 నవంబరులో ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ, ఆ నిర్ణయాన్ని ఎన్హెచ్ఏఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. కేసు విచారణ కొనసాగుతున్నప్పటికీ, ఎన్హెచ్ఏఐ ఏకపక్షంగా నిషేధం విధించిందని ఎన్సీసీ పేర్కొంది.








.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!