
జనరల్

ఆకాశ్అంబానీ జియో సంస్థ వచ్చే ఐదేళ్ల పాటు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. 2031 వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందిన ఆకాశ్ అంబానీ, 2014 నుంచే జియో అభివృద్ధి ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యూహాల రూపకల్పన నుంచి సంస్థ విస్తరణ వరకు అనేక అంశాల్లో ఆయన భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది.
సాంకేతిక విద్య మాత్రమే నాయకత్వానికి ప్రమాణం కాదని, దూరదృష్టి, నిర్ణయ సామర్థ్యం, అనుభవం కూడా ఎంతో ముఖ్యమని ఈ నియామకం మరోసారి చూపించిందనే చర్చ సాగుతోంది. భారతదేశంలో అంతర్జాల వినియోగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిన జియోను, ఆకాశ్ అంబానీ భవిష్యత్తులో ఎలా ముందుకు నడిపిస్తారనే ఆసక్తి వ్యాపార వర్గాల్లో నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!