

రిలయన్స్ జియో కొత్తగా ఎంటర్‌టైన్‌మెంట్ యూజర్ల కోసం ఓటీటీ పాస్‌ను తీసుకొచ్చింది. రూ.200 ధరతో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌లో 15 ప్రీమియం ఓటీటీ యాప్స్, జియోటీవీలో 1000కు పైగా లైవ్ ఛానళ్లు, 30 జీబీ హైస్పీడ్ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్ మే 27 నుంచి అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది.
రూ.1500 విలువైన ప్రయోజనాలను ఈ ప్యాక్ ద్వారా అందిస్తున్నట్లు జియో తెలిపింది. యూట్యూబ్ ప్రీమియం యాడ్-ఫ్రీ సర్వీసులు, జియోహాట్‌స్టార్ మొబైల్+ హాలీవుడ్ కంటెంట్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ కూడా ఇందులో ఉన్నాయి. అదనంగా సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్‌నెక్స్ట్, ఫ్యాన్‌కోడ్ వంటి అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా లభిస్తాయి. జియో టీవీ ద్వారా 1000కు పైగా లైవ్ ఛానళ్లు వీక్షించవచ్చు. ఈ ప్లాన్ మైజియో యాప్, జియో వెబ్‌సైట్ మరియు ఇతర రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!