

షెల్ ఇండియా విడుదల చేసిన “భద్రతపై దృష్టి సారించిన యుగంలో భారత ఇంధన మార్పు” నివేదిక ప్రకారం, అంతర్జాతీయ ఇంధన వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించనుంది.ఈ నివేదిక ప్రకారం, 2040 లో భారత్ ఇంధన గిరాకీలో అమెరికాను, 2060 లో చైనాను అధిగమించే అవకాశముంది. దేశంలో సంప్రదాయ ఇంధనాల వాటా ఈ దశాబ్దంలో గరిష్ఠ స్థాయికి చేరుకుని, ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని పేర్కొంది.
వచ్చే రెండు నుంచి మూడు దశాబ్దాల్లో దేశ మొత్తం ఇంధన డిమాండ్ రెండింతలు అయ్యే అవకాశముందని నివేదిక వెల్లడించింది. గత దశాబ్దంలో ఆర్థిక మరియు జనాభా వృద్ధి కారణంగా భారత ఇంధన వినియోగం 40 శాతం పెరిగింది. 2015 లో మొత్తం విద్యుత్ వినియోగంలో సౌర, పవన విద్యుత్ వాటా సుమారు 3 శాతం ఉండగా, ప్రస్తుతం అది 20 శాతాన్ని దాటింది. 2050 నాటికి ఇది 59 శాతానికి మించవచ్చని అంచనా. వచ్చే దశాబ్దంలో సహజ వాయువు, ఎల్ఎన్జీ వినియోగం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశముందని, పారిశ్రామికాభివృద్ధి మరియు ఏఐ ఆధారిత విద్యుత్ వినియోగం దీనికి తోడ్పడతాయని నివేదిక పేర్కొంది.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!