
జనరల్

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి రూ.12,800 వరకు ధరలు పెరగనున్నాయి. జూన్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కమొడిటీలు, ముడి సరుకుల ధరలు పెరగడంతో కార్యకలాపాల వ్యయం అధికమైందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.
వాహనాల మోడళ్లు, వేరియంట్ల ఆధారంగా ధరల పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులపై అదనపు భారం మోపాలనే ఉద్దేశం సంస్థకు లేదని, మార్కెట్ పరిస్థితులు మరియు ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. పెరుగుతున్న వ్యయాల మధ్య కూడా నాణ్యత, సేవల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!