

అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరల్లో రోజువారీ మార్పులు సాధారణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ వివరాల ప్రకారం మంగళవారం (మే 19) ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,190గా ఉంది. నగరంలో కిలో వెండి ధర రూ.3,00,100గా కొనసాగుతోంది. సోమవారంతో పోలిస్తే బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు కొద్దిగా పెరిగాయి.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,360గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,340గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,210గా, 22 క్యారెట్ల ధర రూ.1,43,190గా నమోదైంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,900గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,490గా కొనసాగుతోంది.
గమనిక: బంగారం కొనుగోలు చేసే ముందు ఈరోజు ధరలను తప్పనిసరిగా పరిశీలించండి. మార్కెట్ మార్పులను గమనించి సరైన సమయంలో కొనుగోలు చేయండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!