

ఉగాది సందర్భంగా బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త లభించింది. నేడు (మార్చి 19) దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. మేలిమి బంగారం ధర సగటున రూ.2,700 వరకు పడిపోగా, వెండి ధరలో కూడా భారీగా తగ్గుదల నమోదైంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,640కు చేరుకుంది, ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.2,780 తగ్గుదల. అదే విధంగా 22 క్యారెట్ బంగారం ధర రూ.2,550 తగ్గి రూ.1,41,750 వద్ద ట్రేడవుతోంది. నగరంలో వెండి ధర కూడా గణనీయంగా తగ్గి ప్రస్తుతం కిలోకు రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది.
ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,940గా ఉండగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.1,54,640గా ఉంది. న్యూఢిల్లీలో ఇది రూ.1,54,790 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ బంగారం ధర చెన్నైలో రూ.1,45,690గా ఉండగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో రూ.1,41,750, న్యూఢిల్లీలో రూ.1,41,900గా నమోదైంది.
వెండి ధరల విషయానికి వస్తే, చెన్నైలో కిలో వెండి ధర అత్యధికంగా రూ.2,65,000గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో సుమారు రూ.2.6 లక్షల వద్ద కొనసాగుతోంది. ఉగాది సందర్భంగా ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపించే అవకాశముంది.
గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా తరచూ మారుతూ ఉంటాయి. పై పేర్కొన్న ధరలు వార్త రాసిన సమయానికి సంబంధించినవి మాత్రమే. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా మరోసారి పరిశీలించుకోవడం మంచిది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!