
క్రీడలు

హైదరాబాద్ ఐటీ రంగం మరోసారి తన బలాన్ని నిరూపిస్తోంది. ఇప్పటికే సుమారు 10.2 లక్షల ఐటీ ఉద్యోగులు ఉన్న ఈ నగరంలో, ఈ ఏడాది చివరికి ఆ సంఖ్య 11 లక్షలకు చేరుతుందని ఐటీ శాఖ అంచనా వేస్తోంది. గ్లోబల్ కంపెనీలు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు భారీగా రావడంతో నగరంలో ఐటీ వృద్ధి వేగంగా కొనసాగుతోంది.
ఐటీ ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3.13 లక్షల కోట్ల ఎగుమతులు నమోదవగా, ఈసారి అది రూ.3.6 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. బలమైన మౌలిక వసతులు, ప్రతిభావంతులైన మానవ వనరులతో హైదరాబాద్ గ్లోబల్ ఐటీ హబ్‌గా మారుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!