

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తాజా పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించినప్పటికీ, రుణగ్రహీతలకు వడ్డీ భారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరియు నిధుల సమీకరణ వ్యయం పెరగడం వల్ల బ్యాంకులు రుణాల మంజూరులో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ, తక్కువ స్కోర్ ఉన్న వారికి అదనపు ‘రిస్క్ ప్రీమియం’ విధిస్తున్నాయి.
మరోవైపు బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల వృద్ధి కంటే రుణాల వృద్ధి వేగంగా కొనసాగుతోంది. డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు అందించాల్సి వస్తుండటంతో, ఆ వ్యయాన్ని రుణాలపైకి మళ్లించే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఎంసీఎల్‌ఆర్ పెంపు ద్వారా పాత రుణగ్రహీతలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే డిపాజిటర్లకు ఇది అనుకూల సమయం. ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8 శాతానికి పైగా వడ్డీ అందిస్తున్న బ్యాంకులు కూడా ఉన్నాయి. రుణం తీసుకోవాలనుకునే వారు మంచి క్రెడిట్ స్కోర్‌ను కొనసాగించడం, వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూడడం, అదనపు రిస్క్ ప్రీమియం వివరాలు తెలుసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!