

సింగపూర్‌లో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026 బిజినెస్ రోడ్ షోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. నవంబర్‌లో జరగనున్న సమ్మిట్‌కు సన్నాహకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన భారత్–సింగపూర్ సంబంధాలను, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న బలమైన అనుబంధాన్ని వివరించారు. సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ నాయకత్వంపై తనకు ఉన్న అభిమానాన్ని కూడా వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ రూపొందించిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం, అమరావతిని బ్లూ–గ్రీన్ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడిదారులు సింగపూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమ గమ్యస్థానంగా భావించాలని ఆయన ఆహ్వానించారు. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్రాజెక్ట్, శ్రీసిటీలో ఎల్‌జీ యూనిట్ వంటి భారీ పెట్టుబడులను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విజయవంతంగా అమలవుతోందని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!