

హెరిటేజ్ సంస్థపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సంస్థ మేనేజింగ్ ట్రస్టీ, ఎండి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. మూడున్నర దశాబ్దాలుగా ఆరోగ్యకరమైన, తాజా పాల ఉత్పత్తులను ప్రతి ఇంటికి అందించడమే తమ లక్ష్యమని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. రూ.4 కోట్లతో చిన్న సంస్థగా ప్రారంభమైన హెరిటేజ్, నాణ్యతపై రాజీ పడని విధానంతో ఈరోజు రూ.4,000 కోట్లకు పైగా విలువైన సంస్థగా ఎదిగిందన్నారు. వినియోగదారుల సంతృప్తి, నాణ్యతపైనే తమ ప్రయాణం కొనసాగుతుందని, ప్రతి ఉత్పత్తికి 25 నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిశుభ్రత, భద్రత విషయంలో చట్టపరమైన ప్రమాణాల కంటే కఠినమైన విధానాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.
పాడి రైతుల సాధికారిత కూడా హెరిటేజ్ ప్రధాన బాధ్యత అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థ 9 రాష్ట్రాల్లో 3 లక్షల మంది పాడి రైతులతో కలిసి పనిచేస్తోందని, సకాలంలో చెల్లింపులు, పారదర్శక కొలతలు, న్యాయమైన ధరలు అనే మూడు సూత్రాలపై భాగస్వామ్యం కొనసాగుతోందన్నారు. వెటర్నరీ సేవలు, పశు సంరక్షణ, శిక్షణ, డిజిటల్ మద్దతు వంటి చర్యల ద్వారా రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సంస్థ విధానాలు, నాణ్యతను ప్రజలు స్వయంగా పరిశీలించాలని ఆమె ఆహ్వానిస్తూ, తరతరాలకు కొనసాగించే అంకితభావమే హెరిటేజ్ వాగ్దానం అని తెలిపారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!