

ఆంథ్రోపిక్ ప్రకటించిన అత్యాధునిక ఏఐ సైబర్ సెక్యూరిటీ టూల్ ‘క్లాడ్ మిథోస్’కు పోటీగా ఓపెన్ఏఐ సంస్థ ‘డే బ్రేక్’ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ విషయాన్ని ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సైబర్ భద్రత రంగంలో ఏఐ ఇప్పటికే అద్భుతంగా పనిచేస్తోందని, భవిష్యత్తులో ఇది మరింత శక్తివంతంగా మారబోతుందని ఆయన పేర్కొన్నారు. సంస్థలు తమ డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేసుకునేందుకు ఓపెన్ఏఐ సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ఇక ఆంథ్రోపిక్ రూపొందించిన ‘క్లాడ్ మిథోస్’ టూల్ టెక్ ప్రపంచంలో భారీ చర్చకు దారితీసింది. దాదాపు 27 ఏళ్ల నాటి పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు, వెబ్ బ్రౌజర్లలో నిపుణులు గుర్తించలేని భద్రతా లోపాలను కూడా ఇది సులభంగా గుర్తించగలదని చెబుతున్నారు. అత్యున్నత కోడింగ్ సామర్థ్యాలున్న ఈ ఏఐ టూల్, సైబర్ భద్రతా లోపాలను గుర్తించడమే కాకుండా వాటిని ఉపయోగించి దాడులు చేసే కొత్త మార్గాలను కూడా స్వయంగా అభివృద్ధి చేయగలదని సమాచారం. దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉన్నందున ఆంథ్రోపిక్ ఈ టూల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!