

హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ 'ఆగమన్' మిషన్‌లో భాగంగా విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించి భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేటు సంస్థ ద్వారా ఆర్బిటల్ రాకెట్ను విజయవంతంగా కక్ష్యలోకి పంపిన మూడో దేశంగా భారత్ నిలిచింది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష వాణిజ్య రంగానికి కీలక మైలురాయిగా నిలవడంతో పాటు, దేశీయ ప్రైవేటు సంస్థల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
ఇండియన్ స్పేస్ పాలసీ-2023, ఎఫ్‌డీఐ సడలింపులు, ఇన్-స్పేస్ మద్దతు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు భారత అంతరిక్ష రంగాన్ని వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 400కు పైగా స్పేస్ స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. స్కైరూట్, అగ్నికుల్, పిక్సెల్, ధ్రువ స్పేస్, బెలాట్రిక్స్ ఏరోస్పేస్ వంటి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి. 2040 నాటికి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ రూ.9.6 లక్షల కోట్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!