

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెంచుతున్న మెటా సంస్థ మరోసారి భారీ ఉద్యోగ కోతలకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 వేల నుంచి 8 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సింగపూర్‌లోని కొంతమంది ఉద్యోగులకు తెల్లవారుజామున 4 గంటలకే టర్మినేషన్ మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. యూరప్, అమెరికా ఉద్యోగులకు కూడా వారి టైమ్జోన్ల ప్రకారం నోటీసులు అందనున్నాయి.
మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ ఒకవైపు వేలాది ఉద్యోగులను ఏఐ ఫోకస్ టీమ్‌లకు మార్చుతుండగా, మరోవైపు సంప్రదాయ విభాగాల్లో ఖర్చు తగ్గింపుపై దృష్టి పెడుతోంది. అదనంగా సుమారు 6 వేల ఖాళీ ఉద్యోగాలను కూడా రద్దు చేస్తున్నట్లు సమాచారం. ఏఐ ఆధారిత భవిష్యత్తు వైపు టెక్ సంస్థలు వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం టెక్ రంగంలో పెద్ద చర్చకు దారి తీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!