22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం

Writer: Nithish 06:05 AM, 22 సెప్టెంబర్, 2026
గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం

ప్రపంచ కృత్రిమ మేధ రంగంలో భారత్‌ కీలక కేంద్రంగా ఎదుగుతోంది. ప్రపంచస్థాయి సామర్థ్య కేంద్రాల (జీసీసీలు) విస్తరణతో పాటు పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉండటం దేశానికి కలిసొస్తోంది. కేవలం సమాచారాన్ని ప్రాసెస్‌ చేయడం, సహాయక సేవలకే పరిమితం కాకుండా.. ఏఐ ఆధారిత అనువర్తనాలు, నమూనా రూపకల్పన, చిప్‌ రూపకల్పన వంటి అధునాతన రంగాల్లోనూ భారత్‌ తన ప్రాధాన్యాన్ని పెంచుకుంటోంది. ప్రముఖ స్థిరాస్తి సేవల సంస్థ సీబీఆర్‌ఈ విడుదల చేసిన ‘ది పాలసీ అడ్వాంటేజ్‌–పవరింగ్‌ ఇండియాస్‌ జీసీసీ గ్రోత్‌’ నివేదిక ప్రకారం.. ఏఐ ఉద్యోగాల కల్పనలో భారత్‌ ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. దేశంలో 1,200కు పైగా జీసీసీలు కృత్రిమ మేధ, యంత్ర అభ్యసన సేవలను అందిస్తుండగా.. 250కు పైగా కేంద్రాలు పరిశోధన, ఆవిష్కరణల కోసం అత్యుత్తమ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశాయి. వీటిలో 2.5 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన నిపుణులు పనిచేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న 23.6 లక్షల జీసీసీ ఉద్యోగాల్లో దాదాపు 94 శాతం ఆరు ప్రధాన నగరాల్లోనే ఉన్నాయి. బెంగళూరు 34 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌ 14 శాతంతో రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో సమాచార సాంకేతికత, జీవశాస్త్రాలు, ఇంజినీరింగ్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో జీసీసీ ఉద్యోగాలు విస్తరిస్తున్నాయి. పుణె 13 శాతం, చెన్నై 12 శాతం, ముంబయి 11 శాతం, దిల్లీ 10 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2031 నాటికి దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు, 1,300కు పైగా కొత్త జీసీసీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే భారతీయ కృత్రిమ మేధ నిపుణుల్లో సీనియర్‌ స్థాయి నిపుణుల వాటా ప్రస్తుతం 19 శాతం మాత్రమే. దీంతో అధునాతన పరిశోధనలు, ఉన్నతస్థాయి నాయకత్వ బాధ్యతలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం రానున్న రోజుల్లో దేశీయ సాంకేతిక రంగానికి కీలక సవాలుగా మారనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

స్పేస్‌ఎక్స్‌ భారీ డీల్‌తో అమన్ సాంగర్‌కు గ్లోబల్ గుర్తింపు

స్పేస్‌ఎక్స్‌ భారీ డీల్‌తో అమన్ సాంగర్‌కు గ్లోబల్ గుర్తింపు

ఏఐ ఎఫెక్ట్.. ఫ్రెషర్లకు ఎదురవుతున్న కొత్త సవాల్!

ఏఐ ఎఫెక్ట్.. ఫ్రెషర్లకు ఎదురవుతున్న కొత్త సవాల్!

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?

ట్యాగ్లు
కృత్రిమ మేధభారత్‌లో ఏఐ ఉద్యోగాలుగ్లోబల్ కేపబిలిటీ సెంటర్లుజీసీసీలుఏఐ టెక్నాలజీహైదరాబాద్ జీసీసీలుబెంగళూరు జీసీసీలుఏఐ ఎంఎల్ పరిశోధనచిప్ డిజైన్టెక్నాలజీ ఉద్యోగాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు
జనరల్

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు
జనరల్

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక
జనరల్

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం
టెక్నాలజీ

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం
జనరల్

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం
జనరల్

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ
జనరల్

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు
జనరల్

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!