

గూగుల్ దీర్ఘకాలం తర్వాత మళ్లీ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాదిలోనే తన తొలి ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేస్తామని సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో గూగుల్ శాంసంగ్, జెంటిల్ మాన్స్టర్లతో కలిసి పనిచేస్తోంది. వార్బీ పార్కర్ సహకారంతో రెండు వేర్వేరు మోడళ్లను అభివృద్ధి చేస్తున్నారు.
ఒక మోడల్లో స్క్రీన్ లేకుండానే జెమిని ఏఐ అసిస్టెంట్ ద్వారా ఆడియో రూపంలో సమాచారాన్ని అందించే ఫీచర్లు ఉంటాయి. మరొక మోడల్లో లెన్స్‌లోనే చిన్న డిస్ప్లేను ఉంచి నావిగేషన్, అనువాదం, వ్యక్తిగత సమాచారం వంటి వివరాలను నేరుగా చూపించే విధానం ఉండనుంది.
గూగుల్ మొదటిసారి 2012 లో స్మార్ట్ గ్లాసెస్ పై ప్రయోగాలు చేసింది. కానీ ఆ సమయంలో ఏఐ, హార్డ్‌వేర్ టెక్నాలజీ పరిమితంగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం గణనీయంగా మెరుగుపడటంతో, ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ప్లాట్‌ఫారమ్ పై మరింత ఉపయోగకరమైన, శక్తివంతమైన కొత్త గ్లాసెస్‌ను అభివృద్ధి చేస్తోందని కంపెనీ పేర్కొంది.
ఇక మార్కెట్లో మెటా–రేబాన్, స్నాప్, ఆలీబాబా, యాపిల్ వంటి సంస్థలు ఇప్పటికే ఏఆర్/ఏఐ గ్లాసెస్‌ను ముందుకు తీసుకువస్తుండటంతో, గూగుల్ కూడా పోటీకి తగిన విధంగా తన ఉత్పత్తులను మెరుగుపరుస్తోంది. గూగుల్ తయారు చేసిన తాజా ప్రోటోటైప్‌లలో గూగుల్ మ్యాప్స్, గూగుల్ మీట్ వంటి యాప్‌ల కోసం ఏఆర్ ఓవర్లే సపోర్ట్ గల మోనోక్యులర్, బైనాక్యులర్ డిస్ప్లేలు ఉన్నాయి. ఇవి స్మార్ట్‌ఫోన్‌కు వైర్‌లెస్‌గా కనెక్ట్ అవటంతో తేలికగా, రోజువారీ ఉపయోగానికి అనువుగా ఉంటాయని సంస్థ చెబుతోంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!