
జనరల్

గూగుల్ తన ఏఐ యాప్‌లో కూడా ప్రకటనలు చూపించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఆర్థిక ఫలితాల సమావేశంలో కంపెనీ ఉన్నతాధికారి మాట్లాడుతూ, సరైన విధంగా అమలు చేస్తే ఈ ప్రకటనలు యాప్ అభివృద్ధికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇప్పటికే గూగుల్ కొన్ని దేశాల్లో ఏఐ ఆధారిత సెర్చ్ ఫలితాల్లో స్పాన్సర్డ్ కంటెంట్‌ను చూపిస్తోంది.
ఇక ఏఐ రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే మరో ప్రముఖ సంస్థ తన చాట్‌బాట్‌లో ప్రకటనల పరీక్షలు ప్రారంభించింది. గూగుల్ కూడా ఇదే దిశగా ముందుకు వెళ్తే రెండు సంస్థల మధ్య పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే వినియోగదారుల అనుభవాన్ని దెబ్బతీయకుండా ప్రకటనలు చూపిస్తామని సంస్థ స్పష్టం చేసింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!