
గాసిప్స్

హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను డీజీపీ సీవీ ఆనంద్ సందర్శించారు. అక్కడ పైలట్ ప్రాజెక్టుగా తొలిసారిగా ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత వ్యవస్థ పనితీరును ఆయన పరిశీలించారు. ఈ పోలీస్ స్టేషన్ను మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దారు. పోలీసు అధికారుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా బాధితులు నేరుగా తమ ఫిర్యాదులను నమోదు చేసుకునేలా ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ విధానంలో బాధితులు ఏఐ యంత్రం ముందు తమ సమస్యను వివరిస్తే, వెంటనే ఫిర్యాదు కాపీ సిద్ధమవుతుంది. అనంతరం ఆ ఫిర్యాదు ఆటోమేటిక్గా సంబంధిత పోలీసు అధికారులకు చేరుతుంది. సాంకేతికతను వినియోగించుకుంటూ పోలీసు సేవలను మరింత వేగవంతంగా, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ పైలట్ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!