
జనరల్

ఆంధ్రప్రదేశ్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో చెరగని సిరా వినియోగంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ సమయంలో ఓటర్ల ఎడమచేతి చిటికెన వేలుపై సిరా గుర్తు వేయాలని అధికారులకు సూచించింది. ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమచేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేశారు.
పోలింగ్ ఏర్పాట్లలో మార్పులు, రీపోలింగ్ కారణంగా కొన్ని కేంద్రాల్లో ఎడమచేతి మధ్య వేలుపైనా సిరా గుర్తు వేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో గత ఎన్నికల్లో వేసిన సిరా గుర్తులు ఓటర్ల వేళ్లపై ఇంకా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఎడమచేతి చిటికెన వేలుపై సిరా గుర్తు వేయాలని ఎస్ఈసీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!