

పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత బలపడి అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగవచ్చని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో కరువు, తీవ్ర వేడి, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ సెలెస్టే సాలో గురువారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావం భారత్‌పైనా ఉంటుందని పేర్కొన్నారు. భారత వాతావరణ విభాగం కూడా ఎల్‌నినో 2027 ఫిబ్రవరి వరకు కొనసాగవచ్చని ఇప్పటికే తెలిపింది. ప్రస్తుత నెలలో దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే 91 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!