
జనరల్

మైఖేల్ డెల్ లాస్ వెగాస్‌లో జరిగిన డెల్ టెక్నాలజీస్ వరల్డ్ 2026 సమావేశంలో సంస్థల కోసం AI మౌలిక వసతుల విస్తరణపై కీలక ప్రకటనలు చేశారు. “AI ఇప్పుడు కేవలం ఫీచర్ కాదు.. ఆధునిక సంస్థల ఆపరేటింగ్ మోడల్‌గా మారుతోంది” అని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి ఎన్విడియా GPUలతో పనిచేసే AI సర్వర్లకు 1,000కు పైగా కొత్త కస్టమర్లు చేరినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా డెల్ పలు కొత్త AI ఉత్పత్తులు, అలాగే గూగుల్, స్పేస్ ఎక్స్ సంస్థలతో భాగస్వామ్యాలను ప్రకటించింది. క్లౌడ్‌పై పూర్తిగా ఆధారపడకుండా సంస్థల అంతర్గత నెట్వర్క్ల్లోనే AI మోడళ్లను నడిపించే పరిష్కారాలను కూడా పరిచయం చేసింది. జెన్సెన్ హువాంగ్ పాల్గొన్న ఈ సమావేశంలో డెల్ తన AI సేవల విస్తరణను ప్రదర్శించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!