

ఆపిల్ అమెరికాలో సెమీకండక్టర్ తయారీని మరింత బలోపేతం చేసే దిశగా బ్రాడ్‌కామ్ తో 30 బిలియన్ డాలర్లకు పైగా విలువైన బహువార్షిక చిప్ సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. 2031 వరకు అమల్లో ఉండే ఈ ఒప్పందం ప్రకారం ఆపిల్ పరికరాల్లో ఉపయోగించే కస్టమ్ సిలికాన్ భాగాలు, FBAR రేడియో ఫ్రీక్వెన్సీ ఫిల్టర్ల రూపకల్పన, తయారీని బ్రాడ్‌కామ్ నిర్వహించనుంది. ఈ భాగస్వామ్యం అమెరికాలో దేశీయ చిప్ తయారీ సామర్థ్యాన్ని పెంచే కీలక అడుగుగా భావిస్తున్నారు.
ఈ ఒప్పందం ద్వారా అమెరికాలోనే 15 బిలియన్కు పైగా చిప్‌లు తయారయ్యే అవకాశం ఉందని ఆపిల్ తెలిపింది. అలాగే కొలరాడో రాష్ట్రంలోని ఫోర్ట్ కాలిన్స్ తయారీ కేంద్ర విస్తరణ కోసం బ్రాడ్‌కామ్ 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ, అమెరికా తయారీ రంగం, ఉపాధి, సాంకేతిక ఆవిష్కరణలకు తమ సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు. నాలుగేళ్లలో అమెరికా ఆర్థిక వ్యవస్థలో 600 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే లక్ష్యంలో భాగంగానే ఈ ఒప్పందం కుదిరిందని కంపెనీ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!