
బిజినెస్

భారత్-ఐర్లాండ్ మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై భద్రతా పరిస్థితుల కారణంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 26, 28 తేదీల్లో జరగనున్న ఈ సిరీస్‌కు ముందు ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ ప్రాంతంలో అల్లర్లు, పోలీసులపై దాడులు, ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో సిరీస్ నిర్వహణపై చర్చ మొదలైంది.
క్రికెట్ ఐర్లాండ్ ప్రస్తుతం పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. దేశీయ టోర్నీల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. భారత్‌తో జరగనున్న అంతర్జాతీయ సిరీస్‌పై ఇప్పటివరకు ఎలాంటి మార్పులు ప్రకటించకపోయినా, అవసరమైతే అదనపు భద్రతా ఏర్పాట్లు, వేదిక మార్పు లేదా ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించే అవకాశం ఉందని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!