

ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ ఉదయ్‌వీర్ సిద్ధు సత్తాచాటాడు. ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 24 ఏళ్ల ఉదయ్‌వీర్ ఫైనల్లో 240.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. జర్మనీ షూటర్ క్రిస్టియన్ రీజ్ 240.1 పాయింట్లతో రజత పతకానికి పరిమితమయ్యాడు. ఇద్దరి మధ్య కేవలం 0.5 పాయింట్ల తేడా మాత్రమే ఉండటంతో పోటీ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది.
చివరి దశలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ ఉదయ్‌వీర్ అద్భుతమైన ఏకాగ్రతను ప్రదర్శించాడు. ఆఖరి రెండు షాట్లకు ముందు అతడు రీజ్ కంటే 0.3 పాయింట్లు వెనుకంజలో ఉన్నాడు. అయినప్పటికీ చివరి రెండు ప్రయత్నాల్లో 10.2, 9.8 పాయింట్లు సాధించి స్వర్ణ పతక పోటీలో ముందంజ వేశాడు. మరోవైపు రీజ్ తన చివరి రెండు షాట్లలోనూ 9.6 పాయింట్లే సాధించడంతో ఉదయ్‌వీర్ విజయం ఖాయమైంది. ఇటలీ షూటర్ పావోలో మోన్నా 219.8 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!