

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ విలువ గత నాలుగేళ్లలో భారీగా పెరిగింది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ నివేదిక ప్రకారం, 2022 ఖతార్ వరల్డ్ కప్‌తో పోలిస్తే ట్రోఫీలోని బంగారం విలువ రెండు రెట్లు పెరిగింది. ఈ ట్రోఫీని 6.175 కిలోల 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయగా, అందులో 4.93 కిలోల స్వచ్ఛమైన బంగారం ఉంది.
ప్రస్తుతం ట్రోఫీలోని బంగారం విలువ సుమారు 7,13,000 అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు రూ.6 కోట్లు. 2022లో ఇది సుమారు 2,77,000 డాలర్లు (రూ.2.31 కోట్లు) మాత్రమే ఉండేది. 1974లో కొత్త డిజైన్ ప్రవేశపెట్టినప్పుడు దీని విలువ కేవలం 25,000 డాలర్లు (రూ.21 లక్షలు) మాత్రమే కావడం గమనార్హం.
ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ క్రీడా ప్రపంచంలో అత్యంత ఖరీదైన కప్పుగా నిలుస్తోంది. ఇతర ట్రోఫీలతో పోలిస్తే దీని విలువ అత్యధికం. 2026 ఫిఫా వరల్డ్ కప్ అమెరికా, మెక్సికో, కెనడాల్లో జరుగుతుండగా, 48 జట్లతో టోర్నీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!