
న్యూస్

ఐపీఎల్ 2026 పోటీల షెడ్యూల్ విడుదల వాయిదా పడింది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు షెడ్యూల్ ప్రకటించాల్సి ఉండగా భారత క్రికెట్ నియంత్రణ మండలి చివరి నిమిషంలో ఆ ప్రకటనను నిలిపివేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
ఈ అనిశ్చితి నేపథ్యంలో మ్యాచ్ల తేదీలు మరియు వేదికలను మళ్లీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందువల్ల ముందుగా టోర్నమెంట్ తొలి పదిహేను రోజుల షెడ్యూల్ను రేపు సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు చెబుతున్నాయి. మిగతా మ్యాచ్ల వివరాలు తరువాత ప్రకటించే అవకాశముంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!