
బిజినెస్

టీ20 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది టీమిండియా. దీంతో న్యూజిలాండ్ ముందు 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ తుది పోరులో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేసి అభిమానులను ఉర్రూతలూగించారు.

భారత్ తరఫున సంజూ శాంసన్ 89 పరుగులతో అద్భుతంగా రాణించగా, ఇషాన్ కిషన్ 54 పరుగులు, అభిషేక్ శర్మ 52 పరుగులు చేసి అర్ధశతకాలు సాధించారు. అలాగే శివమ్ దూబే 26, హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ 3 వికెట్లు తీసుకోగా, మ్యాట్ హెన్రీ మరియు రచిన్ రవీంద్ర తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్యాన్ని చేధించేందుకు ఇప్పుడు కివీస్ జట్టు బరిలోకి దిగనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!