
సినిమాలు

టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్ 8 దశకు సంబంధించిన మ్యాచ్‌ల షెడ్యూల్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 1 వరకు భారత్, శ్రీలంకలోని పలు వేదికలపై కీలక పోరులు జరగనున్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 గా జట్లు విభజించబడి సెమీఫైనల్ రేస్‌లో చోటు దక్కించుకునేందుకు హోరాహోరీగా తలపడనున్నాయి.
టీమిండియా ఈ నెల 22 న అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో, ఈ నెల 26 న చెన్నైలో జింబాబ్వేతో, వచ్చే నెల 1 న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో ఆడనుంది. అలాగే న్యూజిలాండ్ - పాకిస్థాన్, శ్రీలంక - ఇంగ్లాండు, ఇంగ్లాండు - పాకిస్తాన్ వంటి మ్యాచ్‌లు కూడా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సూపర్ 8 దశలో టాప్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!