

టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా పరిస్థితి 'చావురేవు'గా మారింది. ఇప్పటికే జింబాబ్వే చేతిలో పరాజయం పాలైన ఆసీస్, సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక వీరోచిత సెంచరీతో చెలరేగడంతో లంక జట్టు సులభంగా విజయం సాధించి సూపర్-8 దశకు అర్హత సాధించింది.
ఆస్ట్రేలియాకు ఇప్పుడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ (ఒమన్‌తో) మిగిలి ఉంది. అయితే, ఆసీస్ తదుపరి రౌండ్‌కు వెళ్లడం వారి చేతుల్లో లేదు. ఒకవేళ మంగళవారం జరిగే మ్యాచ్‌లో జింబాబ్వే ఐర్లాండ్‌పై గెలిస్తే, ఆస్ట్రేలియా అధికారికంగా టోర్నీ నుంచి తప్పుకుంటుంది.ఆసీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే జింబాబ్వే తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో ఓడిపోవాలి మరియు ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై ఘనవిజయం సాధించాలి. ప్రస్తుత సమీకరణాల ప్రకారం ఆసీస్ సూపర్-8 చేరడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా: 3 మ్యాచ్‌ల్లో 1 గెలుపు, 2 ఓటములతో మూడో స్థానంలో ఉంది








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!