

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడిన అయ్యర్ కేవలం 43 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో అజేయంగా 102 పరుగులు చేశాడు. భారత్ తరఫున 67 టీ20లు ఆడిన తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్ వెనుక మాజీ భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ సూచనలు కీలకంగా నిలిచినట్లు తెలుస్తోంది.
ఆసియా గేమ్స్ తర్వాత తన బ్యాటింగ్ టెక్నిక్‌పై శ్రేయస్ అసంతృప్తిగా ఉన్నట్లు అభిషేక్ నాయర్ వెల్లడించాడు. బంతిని బౌండరీలకు తరలించేందుకు అవసరమైన శక్తిని సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోతున్నట్లు అయ్యర్ గుర్తించడంతో, నాయర్ అతడి గ్రిప్, బ్యాట్ కదలికలపై దాదాపు రెండు గంటల పాటు పని చేశారు. ప్రాక్టీస్ లేకుండా టెక్నిక్‌లో మార్పులు సాధ్యం కావని, బంతిని బట్టి స్పందించాల్సిన అవసరం ఉందని నాయర్ సూచించాడు. తనతో జరిగిన సంభాషణ ఎంతో ఉపయోగపడిందని, విండీస్‌తో మ్యాచ్‌లో తన విధానాన్ని మార్చుకునేందుకు అది సహాయపడిందని అయ్యర్ కూడా చెప్పాడు. గతంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లకు నాయర్ సాంకేతికంగా సహాయం చేసిన విషయం కూడా తెలిసిందే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!