
ఓటీటీ

భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్, చిరాగ్ థాయ్‌లాండ్ ఓపెన్ 2026 టైటిల్ పోరులో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఇండోనేసియా జోడీ రోలీ/డానియల్ చేతిలో 12-21, 23-25 స్కోరుతో ఓటమి చవిచూసింది. రెండో గేమ్‌లో నాలుగు చాంపియన్‌షిప్ పాయింట్లను కాపాడుకున్నా విజయం మాత్రం దక్కలేదు.
సాత్విక్-చిరాగ్ జోడీ గతంలో 2019, 2024 సంవత్సరాల్లో థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈసారి కూడా అద్భుతంగా పోరాడినా కీలక సమయంలో ఇండోనేసియా జోడీ ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!