
జనరల్

డీఆర్ కాంగోతో జరిగిన ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లో పోర్చుగల్ 1-1తో డ్రా కావడంతో జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కాంగో మిడ్‌ఫీల్డర్ ముకావు, విజయం కోసం క్రిస్టియానో రొనాల్డో ఆశించిన స్థాయిలో ప్రయత్నించలేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మ్యాచ్ అనంతరం ఫుట్‌బాల్ అభిమానులు, విశ్లేషకుల మధ్య ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది.
విమర్శల నేపథ్యంలో రొనాల్డో సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “ఇది ఆరంభమే.. ఇంకా ముగిసిపోలేదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. టోర్నమెంట్ ఇంకా కొనసాగుతోందని, జట్టు ప్రధాన లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టిందని ఆయన సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం రొనాల్డో వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!