
సినిమాలు

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా 2026–27 దేశవాళీ క్రికెట్ సీజన్ క్యాలెండర్‌ను అధికారికంగా ప్రకటించింది. పురుషులు, మహిళలు మరియు వివిధ వయో విభాగాల కింద మొత్తం 1,788 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపింది. సీజన్ ఆగస్టు 23న దులీప్ ట్రోఫీ తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 1 నుంచి ఇరానీ ట్రోఫీ జరుగుతుంది.
రంజీ ట్రోఫీ తొలి దశ అక్టోబర్ 11 నుంచి నవంబర్ 5 వరకు, రెండో దశ జనవరి 17 నుంచి మార్చి 3 వరకు నిర్వహించనున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 14 నుంచి ప్రారంభం కాగా, విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 14 నుంచి జరుగుతుంది. దీంతో ఈ సీజన్ క్రికెట్ అభిమానులకు బిజీ షెడ్యూల్‌గా మారనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!