
సినిమాలు

తెలంగాణ బాక్సింగ్ స్టార్ నిఖత్ జరీన్ మరోసారి భారత గర్వంగా నిలిచింది. 2025 మహిళల 51 కేజీ వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టైటిల్ను నిఖత్ తన అద్భుత ప్రతిభతో కైవసం చేసుకుంది. ఈ విజయంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
“నిఖత్ జరీన్ గారికి హృదయపూర్వక అభినందనలు. మీ కఠిన శ్రమ, అపారమైన పట్టుదల భారత్కు, తెలంగాణకు నిరంతరం గర్వకారణంగా నిలుస్తోంది. పెద్ద కలలు కనే ఎన్నో అమ్మాయిలకు మీరు నిజమైన ప్రేరణ”, అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
నిఖత్ జరీన్ వరుస విజయాలతో దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు క్రీడా రంగంలో కొత్త గౌరవం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.



.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (1)
దేశానికి క్రీడా రంగంలో నిఖత్ మళ్లీ గౌరవం తేవడం అభినందనీయం.